మహారామాయణం
(రెండవ భాగం)
రచన
పూరణ్ ధని దాతాదయాల్ మహర్షి శివవ్రత్ లాల్ మహారాజ్
అనువాదం
జ్యోతిరాణి
ప్రోత్సాహకులు
దయాల్ ఆనందరావు మహారాజ్
దయాల్ శివమంగళ్ సింగ్ మహారాజ్
ప్రకాశకులు
శివసాహిత్య ప్రకాశనమండలి,
రాధాస్వామి సత్సంగ భవనం
ప్లాట్ నెం. 7, ఏ.బి.సి. గేట్, వెస్ట్ మారేడ్పల్లి, సికింద్రాబాద్.
మహారామాయణం
ద్వితీయ అయోధ్యాకాండ
మొదటి సముల్లాసం
రాముడు బ్రహ్మ అవతారమే
రాముడు బ్రహ్మ అవతారమే! నిస్సందేహంగా బ్రహ్మావతారమే! ఆయన బ్రహ్మ అవతారమనటంలో నాకెలాంటి సంశయమూ లేదు. ఇతరులకు ఉంటే ఉండనీ! ప్రపంచంలో అనేక రకాల ఆలోచనా విచారాలు గలవారు, అనేక రకాల బుద్ది గలవారు, అనేక రకాల మనసు గలవారు, అనేక రకాల చిత్త ప్రవృత్తి గలవారుంటారు. నేను అందరి గురించీ చెప్పను. నా గురించే చెబుతాను. ఎందుకిలా అంటున్నానో తరువాత వివరిస్తాను.
ప్రపంచంలోకి ఒకరొస్తారు. మరొకరు ఇక్కడి నుండి వెళ్ళిపోతారు. వీరి స్థానాలను వారు తీసుకుంటారు. ఒకరాజు మరణించాడు. ఆయనకు బదులుగా మరొకరు సింహాసనాన్ని అధిష్టిస్తారు. ఒక మఠాధిపతి నిప్ర్కమిస్తే మరొకరికి ఆ పీఠం అప్పగించటం జరుగుతుంది. ఒక ఉద్యోగి వెళ్ళిపోతే అతని స్థానంలో మరొకరిని నియమిస్తారు.
రాముణ్ణి చూడగానే పరశురాముడు తేజోహీనుడయ్యాడు. ఆయనకూడా అవతారమూర్తే! ప్రాణులన్నిటివలెనే అవతారాలు కూడా కాలచక్రం ఆధీనంలో ఉంటాయి. వీరి ఆధీనత సాధారణ జీవు జంతువులతో సమానంగా ఉండదు. కాని వీరు కూడా (అవతారాలు) కాలుని జగత్తులోకి వచ్చాక కాలనియమాలను ఉల్లంఘించరు. పైగా వీరు ఎందుకు వస్తారు? అదే నియమ ఉద్గారం కోసం సాక్షాత్కరిస్తారు. వస్తారు. పనులు నిర్వర్తిస్తారు. వెళ్ళిపోతారు.
కాలచక్రంలో భూత, భవిష్య, వర్తమానాలు మూడూ ఉంటాయి. ఇవి
మూడూ కాల చక్రపు టిరుసులే, చక్రం రాత్రింబగళ్ళు తిరుగుతూనే ఉంటుంది. ఒకసారి పైకి వెళ్తుంది. మరోసారి కిందికి వస్తుంది. ఇంకోసారి మధ్యలో ఉంటుంది. ఇక్కడ కూడా పైన, మధ్య, కింద వంటి స్థాయిలున్నాయి.
ఇలా ఎందుకు ఉన్నాయి? ఇందుకు కారణం కాలజగత్తు త్రిగుణాత్మకమైనది. ఇక్కడ మూడు గుణాలు రాత్రింబగళ్ళు పనిచేస్తుంటాయి. గుణాలంటే మరేమిటో అనుకోకు. ప్రకృతికి మరోపేరే గుణం. ప్రకృతిని గుణమని కూడా అంటారు. ప్రాపంచిక విద్యల సృష్టి వలన గుణము, గుణం కలవాడు అనే భేదంలో పడితే తప్పదారి పట్టటం, పొరపాటు జరగటం, మోసపోవటం వంటివి తప్పవు.
గుణవేు ప్రకృతి. ప్రకృతే గుణం. ఈ ప్రకృతి మరియు గుణాలు మూడురూపాలుగలవై ఉన్నాయి. ఒక దాన్ని ఆధారం అనీ, రెండవదానిని ధార అని అంటారు. ఈ ధార నిలబడే స్థలమే ఆధారం.
ఒకటి సత్వం, రెండవది రజం, మూడవది తమం. సృష్టిలో ఇవి ఆకృతిని పొందినప్పడు, రూపాన్ని పొందినప్పడు ఇందులో నుండి సత్వం అనగా ‘విష్ణు’, రజం ‘బ్రహ్మ, తమం “శివుడు’గా విభిన్నరూపాలేర్పడతాయి. విష్ణువు సత్వాకారుడు, బ్రహ్మ రజ ఆకారుడు, శివుడు తమాకారుడు.
ఇప్పడు ఈ మూడింటిని పరిశీలిస్తే ఇవి కూడా మూడు-మూడు భాగాలవని తెలుస్తుంది. ఇవి కూడా కాల నియమం లోనివే!
వీటి సంగతి వదిలేద్దాం. నీ శరీరం పైకి దృష్టి మళ్ళించు. ఇది కూడా మూడు విభాగాలుగా కన్పిస్తుంది. తల, ఉదరం, కాళ్ళు. ఒక వేలును చూడు! అన్నిటిలోనూ మూడు భాగాలు దృగ్గోచరం అవుతాయి. చేతికి మూడు భాగాలున్నాయి. కాళ్ళవీ మూడు భాగాలే! ఉదరానివీ మూడు భాగాలే! తల-కాళ్ళు కూడా మూడు విభాగాలుగా కన్పిస్తాయి.
త్రిగుణాత్మక జగత్తులో ప్రతి చోటా మూడింటి ఏర్పాటు కన్పిస్తుంది.
తీన్ మే హై తీన్ కా హీ తీన్ ఖేల్
దేఖో తిల్ కే గాఛ్ మే తిల్ గాఛ్ తేల్ ||
ఖేల్తే హై విష్ణు బహ్మ అవుర్ మహేష్
ఖేల్ తే హై చంద్ర తారే ఔర్ దినేష్ II
తీన్ వర్ణ్ ఔర్ దేఖో అపనే వేద్ తీన్
తీన్ మే హై తీన్ గుణ్ అవుర్ భేద్ తీన్ ||
దేఖ లో తుమ్ వస్తు దేశ్ అవుర్ కాల్ కో !
దేఖలో తుమ్ హడ్డి మాంస్ ఔర్ ఖాల్ కో ||
సృష్టి లయ అవుర్ స్థితిమే తీన్ తీన్ !
స్వప్న జాగృతి సుషుప్తి హై తీన్ తీన్ |
బ్రహ్మ యొక్క అవతారం సైతం మూడు కాలాల అధీనంలోకి వచ్చేలా ఏర్పరచటం జరిగింది. లేకుంటే కాల జగత్తు యొక్క సృష్టి క్రమం నడవదు.
పరశురాముడు వెళ్ళాడు. రాముడు వచ్చాడు. విశ్వామిత్రుడు పరశురాముణ్ణి ఆ పదవి నుండి తప్పించి రామునికి ఆ స్థానం ఇప్పించడానికే వెళ్ళాడనటంలో సందేహమేమీ లేదు. అతనికి గర్వంలేదు. పైగా అతడు అజ్ఞాని కూడా కాదు. కానీ ఆయనకు ఏవిషయం సరిగ్గా తెలియదు.
మన జీవనంలో ఇలా జరుగుతునే ఉంటాయి. ఏదవుతుంది? ఏదికాదు? ఇదంతా ఎవరికి తెలుసు? ఎవరికీ తెలియదు. మనసు లోపల ప్రాకృతిక నియమం పని చేసూ ఉంటుంది. ఇది సరిగ్గా తన పని తను చేసుకుంటూ పోతుంది. అది ఎక్కడికి, ఎందుకు తీసుకువెళ్తుందో అంతుపట్టదు. జీవన రహదారిలో కొంత దూరం పయనించాకే కొద్దికొద్దిగా జ్ఞానం కలుగుతుంది.
ఋషులు, మునులు, నక్షత్రాలు, సూర్యచంద్రులు, దేవుళ్ళు, దేవతలు అందరూ ఈ నియమమనే తాడుతో బంధింపబడే ఉన్నారు. మంత్రద్రష్టులనీ, పనుల ఏర్పాట్లను సవ్యంగా ఉండేలా చూసేవారనీ బుషులని అంటారు. వీరు ప్రతి ఒక మండలంలో బంధింపబడిన మండలీకులవుతున్నారు. వీరు తమ చక్రం నుండి, పరిధి నుండి బయటికి పోజాలరు. ఏడుగురు ఉండటం వలన వీరిని సప్తర్షులంటారు. ప్రకృతి యొక్క ఏడుతత్వాలు తమతమ పనులలో నిమగ్నమై ఉంటాయి. వీటి కర్తవ్యాలను, నిర్వహణారీతులను పర్యవేక్షించే బాధ్యత సప్తర్పులకు ఉంటుంది. ముని అంటే మౌనంగా తమ పనిలో నిమగ్నమయ్యేవారు. “మౌనంగా పని చేసేవారి పేరు ముని. వీళ్ళు పని చేస్తారు. కాని మాట్లాడరు. వీరు కూడా ఏడుగురే! ప్రకృతి యొక్క ఏడు దివ్యశక్తులకే దేవీ దేవతలని పేరు. వీరు ఒక నియమానికి బద్దులు. అంటే తమ పరిధిలోనే ఉంటారు. నడుస్తూ తిరుగుతూ కూడా పనిలో నిమగ్నమవుతారు. వీరు కూడా ఏడుగురే! మిత్ర, వరుణ, ఆర్యమన, ఇంద్ర, బృహస్పతి, విష్ణు ‘ రుక్రములు. ఋగ్వేదంలోని ఈ మంత్రంలో వారి సంఖ్య స్పష్ట మవుతుంది
“శని మిత్ర: శం వరుణః శన్నో భవత్సర్యమా
శన్ని ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణు రురుక్రమః
నక్షత్రాలు కూడా ఏడు: సూర్యుడు, చంద్రుడు, మంగళ, బుధ, బృహస్పతి, శుక్ర, శని.
ఇలాగే సప్తలోకాలు, సప్త సముద్రాలు, సప్త సూర్యులు వంటి వాటిని కూడా అర్థం చేసుకోవాలి. వీరందరూ నియమ బద్దులు. వారి పనుల పరిధి దాటి బయటికి రాజాలరు. వీరి దగ్గర బంధనం, ముక్తిల ప్రశ్నే ఉదయించదు. ఈ ప్రశ్న కేవలం మనిషికే పరిమితం! సృష్టిలో మనిషే సర్వశ్రేషుడు. మనిషికే ఈ బంధనం, ముక్తి వర్తిస్తాయి.
జాన్ తే హై, జా న్ కర్ భీ, జాననే వాలే నహీఁ |
మాన్తే హై, మాన్కర్ భీ, మాన్ నే వాలే నహీ ( ) 1
క్యా కహే, కైసే కహే, క్యౌ కర్ కహె హమ్ అప్నా భేద్ 1
హమ్ కో హై పహచాన్ ఔర్ పహచాన్ నే వాలే నహీఁ | 2
మన్ మే అప్నే దేఖతే హై, హై ఛుపీ కోయినా కురేద్ 1
సబ్కా హై అనుమాన్, హమ్ అనుమాననే వాలే నహీ | 3
విశ్వామిత్రుడు విద్యలెన్నో నేర్పించాడు. రాముణ్ణి జనకపురికి తీసుకువెళ్ళాడు. సీతా స్వయంవరంలో పాల్గొనేందుకు దోహదపడ్డాడు. ధనుర్భంగం కావించడానికి అనుజ్ఞనిచ్చాడు. జయమాల వేసే అపూర్వదృశ్యం తిలకించాడు. పరశురామ, లక్ష్మణుల సంవాదం విన్నాడు. ఆయనకు మొదటి నుండీ రాముడు బ్రహ్మ అవతారుడనే సంగతి కొంత వరకు తెలుసు. కానీ ఈ విషయాన్ని ఆయన సంపూర్ణంగా ధృవపరచుకున్నది పరశురాముడు రామునికి తన ధనస్సును అప్పగించినప్పడే! రాముని ప్రభావం చూసి పరశురాముడు తన తలదించుకోవడం చూశాక పూర్తిగా అర్థమైంది. ప్రస్తుత కాలాన్ని బట్టి ఉద్యోగుల పరిభాషలో చెప్పాలంటే రాముడు అవతారపదవి ఛార్జ్ తీసుకున్నాడు. పరశురాముడు ఛార్జ్ ఇచ్చాడు.
పరశురాముడు వేరు, రాముడు వేరు. పరశురాముని స్థితివేరు. పరశురాముడు అసంపూర్ణంగా ఉన్నాడు. ఆ దృష్టితో పరిశీలిస్తే రాముడు పరిపూర్ణుడు. పరశురాముడు బ్రహ్మచారి. రాముడు గృహస్థాశ్రమంలోకి వచ్చాడు. భార్యలేని మనిషి-అంటే అవివాహితుడు ఎంతటి పండితుడైనా, గొప్ప వాడైనా ప్రపంచపు స్థితిగతులను క్షుణ్ణంగా తెలుసుకోజాలడు. ప్రేమకు అర్థం అతనికి బోధపడదు. ప్రత్యక్షంగా తను అనుభవించాకే దాని గురించి తెలుస్తుంది. లేకుంటే అతనిది బాల్యలీలా జీవనమే ననవచ్చు. పెళ్ళితోనే ప్రాపంచిక జీవనం ప్రారంభమవుతుంది. పురుషుడు ప్రకృతిలో విలీనమవుతాడు. నరుడు, నారి-వీరిద్దరి పరస్పర సంయోగం జరుగుతుంది. ఇతడు గృహసీమకు రాజైతే ఆమె రాణి అవుతుంది. ప్రాపంచిక భారం ఇతని తలపై పడటం మొదలవుతుంది. ఇక అతడు మనిషిలా ప్రవర్తించటంలో నిమగ్నమవుతాడు.
రాముడు బ్రహ్మ యొక్క అవతారుడే! ఆయన బ్రహ్మ అవతారమని పదే పదే చెబుతున్నాను. బుద్ధి పూర్వకంగానే ఆయన మత్స్య, కచ్ఛప, నృసింహ, వామన, పరశురామ అవతారాలను ధరించాడు. రామావతారమెత్తాడు. గృహస్థుడయ్యాడు. గృహస్థ ధర్మాన్ని, మర్యాదను పూర్తిగా పాటించాడు. మర్యాదా పురుషోత్తముడని పించుకున్నాడు.
ఈ పనిని ఆయన ఎలా చేశాడు? ఎప్పడు చేశాడు? ఈ వృత్తాంతం అవధి ఖండం-అయోధ్యా కాండ చివరి వరకు ఉన్న చరిత్రలపై విచారణ చేయటం వలన అర్ధం అవుతుంది.
అవధ్ అని అవధి (హద్దు)ని అంటారు. సురత్ (తవజ్ఞ) ను అవధి అంటారు. ప్రతిజ్ఞను, ‘అవ’ = మొదటి, ధ = ధారణ చేయటం. ఇది అవధి.
రాముడు ఈ జీవనంలో సురత్ ధారి, ప్రతిజ్ఞాధారి, ధారణాధారి అయ్యాడు.
ఇక ఇప్పడు కథా ప్రసంగం వినండి.
రెండవ సముల్లానం
యువరాజు పదవిని గురించిన ఆలోచనలు
పది ఇంద్రియాలపై – పది రథాలపై ఆసక్తుడైన శరీరధారి దశరథుని ఆనందానికి హద్దుల్లేవు. ఇల్లు కళకళలాడుతున్నది. సంతానం కలిగింది. వారు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. పెళ్ళిళ్ళయ్యాయి. పుత్రవధువులు (కోడళ్ళు) ఇంటికొచ్చారు. గృహస్థుల సుఖం ఇలాంటి అంశాల్లోనే ఉంటుంది. ఆయన, ఆయన భార్యలు ముచ్చటైన కొడుకు-కోడళ్ళ జంటల్ని చూసి సుఖసంతోషాల సాగరంలో ఓ ల లాడ సాగారు. కొడుకులు మంచివారీ, సుశీలురు, ఆజ్ఞాకారులు, ధర్మపరాయణులు. వారి భార్యలుకూడా ధర్మాత్ములు. పతివ్రతలు. అత్తామామలను సీవించేవారు. ఇప్పడు ఇంకేం కావాలి?
ఘర్ బనా మంగళ్ భవన్, మంగళ్ కీ సుఖ్ కీ ఖాన్ థా !
మంగళ్ ఇస్కా నామ్ రూప్ ఔర్ మంగళ్ ఉస్కీ జాన్ థా |
మంగళా ముఖ, సర్వదా సుఖ్, మంగళం మంగళం సదా !
రాత్ దిన్ థా హర్ష అరు, నిత్య మంగళ గాన్ థా |
రామ, లక్ష్మణ, భరత్, శత్రుఘ్న చారోఁ హీ మంగళ్ బనే !
మంగళ్ అబ్ దశరథ్ కా బల్, పరాక్రమ అవుర్ అవసాన్ థా |
థా ఇధర్ మంగళ్, ఉధర్ మంగళ్, ఉసీ కీ ధూమ్ థీ !
ధర్మ మంగళ, కర్మ మంగళ, దక్షిణా అవుర్ దాన్ థా !!
దశరథుడు జీవించి ఉన్నప్పడే, ఆరోగ్యంతో ఉన్నప్పడే రామునికి యువరాజ
పదవిని ఇస్తే బాగుంటుందనే ఆలోచన అందరికీ కలిగింది. ప్రజలు అప్పడు మరింత సుఖంగా, నిశ్చింతగా ఉండగలరు. ఈ మాటే ముందుగా ఒకరెవరో అన్నారు. అది పదిమంది చెవులకూ చేరింది. పది నుండి ఇరవై, ఇరవైనుండి వందమంది నుండి వేలాది మందికీ చేరింది. దేశమంతటా వ్యాపించింది. అందరూ ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు.
ఆధారం నుండి ధార వెలువడినప్పడు ఆ ప్రవాహాన్ని ఎవరాపగలరు? శిరస్సు యొక్క శిఖ నుండి నర నరాలలోకి సురత్ ప్రవాహం వ్యాపిస్తే దానిని ఎవరు ఆపగలరు ఆపగల శక్తి సామర్థ్యాలు ఎవరికీ ఉండవు.
ధార్ జబ్ ఆధార్ సే నికిలీ, హుయీ వహ సహస్ ధార్ |
సూత్ మే హోతే హై జై సే, సూత్ హీ కే తార్ తార్ |
ధార్ సత్యాకార్ హోకర్, జబ్ తపాకారీ బనీ
ఉస్మే శూన్యాకార్ హై, ఔర్ హై ఉసీ మే ఓంకార్ ||
జగత్ కీ రచనా మే ద్వంద్వాకార్ హీ కా హై ప్రబంధ్ |
ఏక్ సే జబ దో హుయే, దో సే లక్ష అవుర్ హజార్ ||
త్వం సే తత్ హై, త్వం పదం అవుర్ తత్వం పదం !
తత్వ హై, తత్వోమసి, ఇస్కా కరో సాక్షాత్కార్ ||
అపనే తన్ మే ధార్ లో, తారోంకా తుమ్ యజ్ఞోపవీత్ |
ఈడా, పింగలా, సుషుమ్నా తీనోం కా హీ మన్ మే వీచార్ ||
కౌసల్య విన్నది. ఈచర్చల గురించి దశరథునికి చెప్పింది. దశరథుడు తలపంకించి
వశిష్ఠుని సమ్మతి తీసుకున్నాడు. “రాముడు సుయోగ్యుడైన పుత్రుడు. ఆయన యువరాజైతే రాజ్యానికి శుభం, కళ్యాణం జరుగుతుంది. ఆయనకి తప్పక యువరాజ పదవిని ఇవ్వండి. మీ ఆలోచనను నేను బలపరుస్తున్నాను”. అన్నాడు వశిష్ఠుడు. మంత్రులందరూ తమ తమ సంతోషాన్ని వెల్లడించారు. ఇక కావాల్సిందేముంది? దశరథుడు చేయబోయే శుభకార్యారంభానికి పూనుకున్నాడు. రేపు శుభదినం. చాలా మంచిరోజు. రేపే రామునికి రాజతిలకం పెడదాం”అన్నాడు వశిష్ఠుడు. దశరథుడు ముఖ్యులైన కొందరు ఉద్యోగులను పిలిపించి, “సమస్త నగరంలో దండోరా వేయించి చాటించండి. రేపు మధ్యాహ్నం రాముడిని (అవధ) అయోధ్యకు యువరాజును చేస్తున్నాం. నగరాన్ని శోభయామానంగా అలంకరించండి. అందరిళ్ళకు పచ్చతోరణాలు కట్టండి. మంగళ గానాలు చేయండి. అంతటా ప్రకాశమానంగా ఉండేలా సర్వత్రా దీపాలు వెలిగించండి. పువ్వులు, పళ్ళు, బిల్వపత్రాలు సేకరించి ఉంచండి” అంటూ దశరథుడు ఆజ్ఞాపించాడు.
రాజాజ్ఞ మహా ఆజ్ఞ. ఆయన నోరు విప్పి చెప్పటమే తరువాయి. “రాజవాక్యం జనార్ధనమ్”. సమస్త నగరంలో సందడి ప్రారంభమైంది. అలంకరణలు జరగసాగాయి. సాయంకాలం వేళ వరకు అయోధ్యాపురి సూర్యమండలంలా ప్రకాశాలు చిందసాగింది. దీపావళి దృశ్యం కళ్ళ ముందు మెదిలింది. ప్రతి చోటా మృదంగధ్వనులు వినిపించసాగాయి. సభలు ఏర్పాటయ్యాయి. ఆర్భాటాలు, ఆనందాలు చెలివిరుసున్నాయి.
రాముడు అందరికీ ప్రియతముడే! అందరికీ ఇష్టుడే! అందరి అభిమానము చూరగొన్నవాడే!! ఆయన చల్లని స్వభావం విచిత్రమైనది. ఒక్కసారి ఆయనను చూస్తే చాలు. చూసినవారు ఆయనపై మోహితులయ్యేవారు. రాముడు మాట్లాడుతుంటే నోటి వెంట పువ్వులు రాలేవి. అంటే అంతటి మృదు సంభాషణ * చేసేవాడన్నమాట! ఈయనకి విరోధులు ఒక్కరు కూడా లేరు.
రాముని వద్దకు ఒక్కరొక్కరే వస్తూ అభినందించసాగారు. రాముడు అందరినీ ఆదరించాడు. ఆయన స్వాభావికంగా ఉదాసీనంగా ఉండేవాడు. అభినందనలకు జవాబుగా-“నా మనసులో ఎలాంటి కోరిక లేదు. నేను కేవలం జగతి యొక్క సేవాభారాన్ని నా తలపై ఎత్తుకోడానికి వచ్చాను. యువరాజునైతే ఏమిటి? కాకుంటే ఏమిటి? సేవ చేయటమే నా ధర్మం. ఇదే నా జీవన ఆదర్శం. మీరు నన్ను సన్మానిస్తున్నారు. నేను మీకు కృతజ్ఞణ్ణి. మీరూ, నేనూ కలిసి ప్రజలంతా సుఖంగా ఉండేందుకు కలిసి పనిచేద్దాం. దుఃఖం ఎవరినీ బాధించకూడదు. మీరు నా వెంటే గండి, మీ పనులతో సహకరించండి. అప్పడు మీ ఈ సన్మానపత్రాలు ఆర్పించడంలోని లక్ష్యం పూర్తవుతుంది. రాజదర్బారులో ఇలా యువరాజు
పదవులివ్వడం సాధారణమైన విషయమే!’ అన్నాడు.
అందరూ రాముని మాటలను విని ముగ్దులై తమ తమ ఇళ్ళకు మళ్ళారు.
మూడవ సముల్లాసం
స్వర్గంలో సభ – దేవతలలో కలవరం
ప్రకృతితో సంబంధం కలిగి ఉన్న దివ్యశక్తులనే దేవతలని అంటారని నేను చెబుతూనే ఉన్నాను. దేవత శబ్దం – సంస్కృత ధాతువు ‘దివ్’ (ఆడటం)తో ఏర్పడింది. దేవతలు ఆటలాడగోరతారు. బంధనంలోకి రావటం వారికి నచ్చదు. అసురులు వీరిని ఆడనీయకుండా అడుపడుతుంటారు.
వీరు శరీరధారులా అని నీకు అనుమానం రావచ్చు. ఔను! వీరు శరీర ధారులనే అంటున్నాను. శరీరం లేనిదే ఏ శక్తీ తన ప్రభావం చూపించజాలదు. నీవు పరిశీలించు! ఆలోచించు! అర్థం చేసుకో! శరీరం లేకున్నా పనిచేయగల దివ్యశక్తిని నీవు చూస్తే నాకు చూపించు. కర్మ జరిగితే అది శరీరం ద్వారాయే జరుగుతుంది. శరీరం లేకుండా పని ఎలా చేస్తాం? విచారం-ఆలోచన ఏర్పడితే అది మనసులోనే ఏర్పడుతుంది. నీవు అంగీకరించినా, అంగీకరించకపోయినా అది నిజం. నేను అంగీకరించాను. అంగీకరిస్తున్నాను. నాకు సందేహమేదీ లేదు. అందుకే దేవతలు శరీరాధారులని ఒకటి కాదు వేయి నోళ్ళతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను.
బ్రహ్మ కూడా శరీరధారే! ధైర్యముంటే నా మాటను కాదనండి! చూద్దాం. ఈ బ్రహ్మాండం బ్రహ్మ శరీరమే. బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు ముగురూ శరీరధారులే. అలాగే ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వి వంటి పంచభూతాలకు కూడా శరీరాలున్నాయి. వీటికి శరీరం లేకుంటే పనులేవీ చేసేవి కావు. దేహం లేకుంటే పని చేయటం అసాధ్యం.
రాముడు అయోధ్యకు యువరాజు కాబోతున్నాడని విని దేవతలంతా బాధపడ్డారు. దశరథుని తూలనాడసాగారు. దేవతలందరిలోనూ కలవరం పుట్టింది. అంతా ఒక చోట చేరి సభ నిర్వహించారు. ప్రజాపతి బ్రహ్మను సభాపతిని చేశారు. విష్ణువు తన సేనలైన దేవతలను తన వెంట తీసుకువచ్చాడు. శివుడు భూతాలు, పంచతత్వాలు, భేతాళ, ధాన, సుర, తాల తదితర సేనతో తరలి వచ్చాడు. బ్రహ్మదేవుడు తన సేనలైన జీవ జంతువులతో కదలి వచ్చాడు. దేవతలంతా ఒక చోట సమావేశమయ్యారు.
“రాముడు ఏ విధి నిర్వహించడానికి అవతరించాడో దానికి విఘ్నం కలిగేలా ఉంది” అన్నాడు బ్రహ్మ దేవుడు.
“అలా జరగరాదు’ అన్నాడు శివభగవానుడు.
“నా సమస్త బలం అంటే దేవగణం కోతులుగా, ఎలుగుబంటుగా మారి రామునికి సహాయం చేస్తారు” అన్నాడు విష్ణుభగవానుడు.
“మీరంతా ఇలా అన్నంత మాత్రాన పనులవుతాయా? అక్కడ హాని పొంచి కూర్చుంది. దానిని తొలగించే ఉపాయం కూడా ఆలోచించవలసి ఉంది కదా” అన్నాడు బ్రహ్మ
తళతళ మెరుస్తూ ప్రకాశవంతంగా కాంతులీనుతున్న ఇంద్రుడు లేచి నిల్చున్నాడు. “నేను దివ్యశక్తులు గలవాణ్ణి. రావణుని కొడుకు మేఘనాథుడు నన్ను బంధించాడు. నేనాతని ఆధీనుడనయ్యాను, పనిలేకుండా ఉండటం నాకు నచ్చదు. పని చేస్తాను. నా కార్యం ఆటపాటలతో సిద్ధించాలి. మనిషి బుద్ధి బలంతో కార్యం నెరవేర్చుకోవాలి. కాని రావణుడు, ఇంద్రజిత్తుడు ఇద్దరూ కలసి తమ ఉద్యోగుల ద్వారా వేలాది యంత్రాలు చేయించారు. వాటిలో నన్ను బంధించారు. లక్షల పనులు చేయించుకుంటున్నారు. పగటిపూట పొలం దున్నాలి. గాలి వీచాలి. సమస్త లంకకు రాత్రివేళలో నేను ప్రకాశం ఇస్తూ ఉండాలి. వెయ్యి మంది చేసే పని ఒక్క ( యంత్రంతో అయిపోతుంది. భూలోకంలో అంతటా కలహాలు, చిక్కులు, ఇబ్బందులు వ్యాపించి ఉన్నాయి” అన్నాడు.
“నన్ను కూడా అతడు చెరసాలలో బంధించాడు. తన ఇష్టం వచ్చినప్పడు యంత్రాల బలంతో నన్ను ఎక్కువగానో, తక్కువగానో చేసి తన శత్రువులకు నష్టం కలిగిస్తుంటాడు. మామూలుగా నైతే నేను అందరి జీవనాలకు కారణం అవుతాను. రావణుడు లంకా పర్వతంపైన,కింద, మధ్యలో నగరాన్ని నిర్మించాడు. యంత్రాల్ని పెట్టాడు. ఇళ్ళలో శుద్ధ వాయువును చేసి నన్ను పంపిస్తాడు. వారి నుండి పన్నులు వసూలు చేస్తాడు. ఆకాశమార్గాన ఈతని పుష్పక విమానాన్ని నేను నడపవలసి ఉంటుంది” అన్నాడు వాయుదేవుడు.
“నాది అతి పెద్ద దుస్థితి అనవచ్చు. నేను ప్రకృతి సహజమైన రీతిలో లేను. కోరిన చోట ఉండలేను. రావణుడు తన యంత్రాల ద్వారా పైకి కిందికీ తీసుకుపోతాడు. సాధారణ నీటిని ఎవరినీ తీసుకోనివ్వడు. శత్రువులెదురైనప్పడు నన్ను ఓ పెద్ద వరదగా మార్చి వారి పైకి నన్ను ప్రేరేపించి ఆ శత్రువులను కష్టనష్టాలకు గురి చేస్తాడు. తనకు ఇష్టమైన రీతిలో నన్ను ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్తాడు. నేను సర్వాంగాలతో సంపూర్ణంగా రావణుని వశీభూతుడనయ్యాను’
చెప్పాడు వరుణదేవుడు.
“ఎక్కడా యజ్ఞం లేదు. ధర్మం లేదు. నేను జగతికే పురోహితుడననిపించుకున్న వాణ్ణి. ఇప్పడు రావణుని ఆధీనుడనై అతని ఆదేశాలను పాటించవలసి వస్తోంది.
అతని శత్రువులను వేలాదిమందిని, లక్షలాది మందిని కొన్ని మైళ్ళ దూరంలో ఉండగానే కాల్చేస్తున్నాను. నా పురోహిత ధర్మానికి ఈ గతి పట్టింది. రావణుని శతఘ్నిని ఒక్కొక్క క్షణంలో వెయ్యిసారు పేలుస్తారు. శత్రువులని మసి చెయ్యవలసి వస్తోంది…” అన్నాడు అగ్ని దేవుడు.
అంతలో భూదేవి రోదిస్తూ వచ్చింది. పృథ్వీ మాత వైపు అందరూ దృష్టి సారించారు. “నా కష్టాల గురించి ఎలా చెప్పమంటారు. ఎన్నో బాధలనుభవిస్తున్నాను. నా వనస్పతులు, గడ్డి, పచ్చిక మేటలు, ఉమ్మెత్త, గంజాయి వంటి వాటిని రావణుడు కాల్చివేసి విషపు ధూళిగా మారుస్తున్నాడు. తన శతఘ్ని ద్వారా శత్రువుల సైన్యంలోకి పంపి వారిని ఉన్మత్తులను చేస్తున్నాడు. నాతో అనర్గాలను చేయిస్తున్నాడు. అతడు తలచుకుంటే లక్షలాది మందిని, కోటూది మందిని జీవ జంతువులను క్షణంలో మటుబెట్టగల చూర్ణాన్ని తయారుచేశాడు. సృష్టి పటాన్నే మార్చేయగలిగేలా ఏర్పాటు చేసుకున్నాడు” అంది.
సూర్యభగవానుడు తన కిరణాల అశ్రువులను కురిపిస్తూ వచ్చాడు. తన సమస్యలు చెబుతూ, “నేను రావణుని వంటమనిషి నయ్యాననుకోండి. అతనికి నేను నీళ్ళు వెచ్చబెట్టాలి. నా కిరణాలతో అతని ఆహారం ఉడుకుతుంది. అతను తలచుకుంటే పగలుని రాత్రిగా, రాత్రిని పగలుగా మార్చగలుగుతున్నాడు. వేసవి కాలంలో నా ఉష్ణాన్ని తగ్గిస్తున్నాడు. లంకకు చల్లదనాన్ని కలిగిస్తున్నాడు. శరదృతువులో తన దేశాన్ని వేడిగా ఉంచుతుంటాడు. నా శక్తులను పరిశీలించడానికి అతను స్వర్గానికి మెట్లు వేసుకుని రాగల సమరుడు. కానీ ఇంకా అతనికి ఈ ఆలోచన రాలేదు. చంద్రుని స్థితీ నా వలెనే ఇలాగే ఉంది” అన్నాడు సూర్యుడు.
సముద్రుడు వచ్చాడు. ఆయన గొప్పదనం తగ్గిపోయింది. రావణుడు సముద్రుని పొరుగునే నివసిస్తున్నాడు. “నాకు పట్టిన దుస్థితిని ఎలా వర్ణించగలను? ఇది ఎవరికి తెలుసు? సముద్రాన్నంతా పెద్ద రంధ్రంగా చేశాడు. ప్రతిచోటా లెక్కలేనన్ని యంత్రాలు చేసి పెట్టాడు. పక్షులు సైతం సముద్రం పై నుండి ఎగిరి లంక వైపు వెళ్ళజాలవు. పక్షుల ఛాయ పడగానే యంత్రాల భాగాలు కదలుతుంటాయి. దాని వలన ఆకర్షణ శక్తి ఉత్పన్నం అవుతుంది. ఈ శక్తి పక్షులను ఆకర్షించి సముద్రంలో ముంచి వేస్తుంది. ప్రతిరోజూ ఇలాంటి లక్షలాది జీవ జంతువులు, పక్ష్యాదులు మృతి చెందుతున్నాయి. దేవతల ఆకాశరథం, విమానం సైతం ఇప్పడు అటువైపు వెళ్ళలేకపోతున్నాయి. సాగరజలాలను తీయుగా మార్చడానికి వ్యూహం రూపొందిస్తున్నాడు రావణుడు. అదే చేశాడనుకోండి! ఇక నా కథ ముగిసినట్లే! మృత్యువు నన్ను కబళించినట్లే!” అన్నాడు సముద్రుడు.
వీరి జాలిగాధలు వింటున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గాభరాపడ్డారు. కోట్లాది దేవతలు అక్కడికి చేరుకున్నారు. ఎవరెవరి అభ్యర్థనలు, బాధలు వినాలి? అంత సమయం లేదు. మాటలు చెప్పకుంటే జరిగేదేముంది? ఏదో ఒక పని చేయవలసి ఉంది.
ఈ క్రింద రాసిన అంశాలను ఆ సభలో సమర్పించటం జరిగింది.
- ఎలుగుబంట్లు, వానరులు, రాక్షసుల రూపాలు ధరించి దేవతలు అడవుల్లో
ఉండాలి. రాముని రాకకై నిరీక్షించాలి.
- రామునికి ఈ దేవతల విషయాలేవీ తెలియనివ్వకూడదు. దేవతలు రావణునికి విరుద్ధంగా వ్యూహం పన్నుతున్నారని, ద్రోహం తలపెట్టారని ఎవరికీ తెలియనీయకూడదు. రావణునికి పొరపాటున కూడా అనుమానం రాకూడదు.
- రాముడు యువరాజు కాకుండా నిరోధించగలవారిని మానవలోకానికి పంపాలి. అక్కడ తమ లక్ష్యానికి ఉపయోగపడేవారిని ప్రభావితులను చేయగల దేవతనో, దేవుడినో అన్వేషించాలి.
ఈ మూడు అంశాలు అందరికీ నచ్చాయి. అందరూ తమ అంగీకారాన్ని తెలిపారు. ఆ నాటికి దేవతల సభ ముగిసింది.
నాలుగవ సముల్లాసం
మన ప్రశోత్తరాలు
దేవతలు, దేవుళ్ళు జడులా, చైతన్యులా? అని మీరడగవచ్చు.
(1) ఈ ప్రశ్నకు స్థానమే లేదని నేనంటాను. బ్రహ్మవిష్ణు మహేషులు ముగ్గురు ఈ జగత్తు నిర్వహణకర్తలు. ఏర్పాటు చూసేవారు. జగత్తు త్రిగుణాత్మకమైనది. ఇది మూడు గుణాల కలయిక! జగతు యొక్క నిర్వహణను జడమైనవి చేయగలుగుతాయా? చేతనత్వం (చైతన్యం) కలవారే చేయగలుగుతారా అని నీవు
(2) జడ చేతనత్వాలు రెండూ ఉపేక్షించదగినవి. వాస్తవానికి ఇక్కడ ఎవరూ
జడం కాదు. చేతనం కాదు. చలనం కలిగి, నడిచి, తిరిగే వారిని చేతనత్వం కలవారనీ, అలా చేయకుంటే జడం అనీ నీవంటావు. ఉపేక్షను తొలగించు. అప్పడు ఏదీ జడంగా తోచదు. చేతనంగా తోచదు. జడం లేదు. చేతనం లేదు. ఏది ఉందో అది అదై ఉందంతే!
(3) వనస్పతులలో చేతనశక్తి లేదంటే పొరపాటేనంటాను. కంకర, రాళ్ళలో సైతం వాటి జీవన శక్తి ననుసరించి చేతనత్వం ఉంది. చేతనత్వానికి రెండు భాగాలున్నాయి. ఒకటి పెరగటం, మరొకటి ఆలోచించటం. వనస్పతైనా, కంకర రాళ్ళయినా అన్నిటికన్నీ పెరుగుతాయి. ఆలోచిస్తాయి. ఈరోజు అవి ఏ స్థితిలో ఉన్నాయో మరో రెండు మూడు నెలల తరువాతనో రెండు, మూడు సంవత్సరాల తర్వాతనో అదే స్థితిలో ఉండకపోవటం కన్పిస్తుంది. అంటే అవి మార్పుకు లోనయ్యాయన్న మాట! దీనికి కారణం అవి పెరుగుతూ ఆలోచిస్తుండటమే! ‘లాజవంతి మొక్క ముకుళించుకుపోవటాన్ని, యథాస్థితికి రావడాన్ని చూసి అంచనా వేసుకో! ధృవపరుచుకో.
(4) ‘బ్రహ్మ ఏమిటి? ఎవరు? నీవు నీ ఇష్టుడిగా, ఆదర్శంగా అంగీకరించిన వస్తువు లేదా దేవుడు జడమా? చేతనమా? చేతనమనే నీవంటావు. బ్రహ్మ చేతనమైనప్పడు అతని జగత్తు జడం ఎలా అవుతుంది? ఇది కూడా చేతనమే అవుతుంది. ఎవరిలో బ్రహ్ = పెరగటం; మనన్ (ఆలోచించటం) ఉందో అతడు బ్రహ్మ జగత్తు బ్రహ్మ మయం. ఇందులో ఉన్నదంతా బ్రహ్మమే! బ్రహ్మ తప్ప మరేదీ లేదు. బ్రహ్మ నుండి మొదలుకొని గడ్డిపోచ వరకు అన్నీ పెరిగి ఆలోచించేవే! ఇది బ్రహ్మ యొక్క గుణం, కర్మ, స్వభావం. జగత్తు కూడా బ్రహ్మ లాంటిదే!
దేవతలు, దేవుళ్ళు మనలా మాట్లాడగలుగుతారా అని నీవడగవచ్చు. మొదట్లోపూర్వం ఒకప్పడు వాళ్ళు మాట్లాడి ఇప్పడెందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించవచ్చు. దేవతలు, దేవుళ్ళు పూర్వం మాట్లాడితే ఇప్పటికీ మాట్లాడతారు. వీరి భాషను అర్థం చేసుకోగలిగిన ప్రతిభ కలవారెవరైనా ఉంటే వారు ఇప్పటికే మాట్లాడతారు. మాట్లాడటం అంటే ఏమిటి? తమ అస్తిత్వపు సత్తాను, శక్తిని వ్యక్తం చేయటం! ప్రగటించటం! తన సత్తాను, శక్తిని వ్యక్తం చేయని వస్తువు ప్రపంచంలో ఏదైనా ఉందా? అలా అన్నీ చేస్తున్నాయి. నీవు దానిని అర్ధం చేసుకోకుంటే అది వేరే విషయం. – –
బ్రహ్మ హై ఆధార్ సబ్ కా, బ్రహ్మ హీ మే ధార్ హై |
హై శిఖా జబ్ బ్రహ్మ సూత్రోఁ కా, భీ వహ కర్తార్ హై | 1
బ్రహ్మ సత్ హై బ్రహ్మ చిత్ హై, బ్రహ్మ సే ఆనందగతి |
బ్రహ్మ ఆనందాకార్, చేతాకార్ సత్యాకార్ హై | 2
బ్రహ్మమయ హై జగత్ ఔర్ యహ జగత్ ఉస్కా రూప్ హై |
బ్రహ్మ హీ ఇస్ నామ్ రూప్ కే జగత్ కా విస్తార్ హై | 3
ఐదవ సముల్లాసం
సరస్వతి -మంథర
క్రమంగా చీకట్లు ముసురుకున్నాయి. ఆనాటి రాత్రి అయోధ్యలో దీపావళి ఉత్సవం నిర్వహించబడుతోంది. ఎక్కడ చూసినా ఆనందసందోహాలు, ఉల్లాసాల కేరింతలు, నృత్యాలు, నవ్వులు కన్పిస్తున్నాయి. తెల్లవారితే రామునికి యువరాజుగా రాజ్యాభిషేకం జరగబోతున్న అపూర్వ సన్నివేశాన్ని చూస్తామని ఉత్సాహంగా ఉన్నారందరూ. రాజ్యనిర్వహణా భారం ఇకపై నవయువకుడైన రామునికి అప్పగించబడుతుంది. ఇలాంటి ఆలోచనలలోనే ప్రజలంతా నిమగ్నులయ్యారు. ప్రపంచం యొక్క స్థితిగతులు విచిత్రమైనవి. మరుక్షణంలో ఏం జరగబోతున్నదో ఎవరికీ తెలియదు. తెలుసుకోలేరు కూడా! ప్రకృతిశక్తులు ఆశ్చర్యకరమైన విలాసాలను ప్రదర్శిస్తాయి. దేవాసుర సంగ్రామ భూమిలో విజయం ఎవరిని వరిస్తుంది? ఎవరు పరాజయం పాలబడతారు? ఇలాంటివి తెలుసుకోవాలంటే మన బుద్ధికి అందదు. అందేల” ఉంచబడలేదు.
కైకేయి దగ్గర దాసిగా ఉన్న మంథర ఏదో కొనడానికి బజారుకు వచ్చింది. ఆమెకు గూని ఉంది. క్రూరస్వభావురాలు. దేవతల ప్రోత్సాహం మేరకు సరస్వతీదేవి తనకు పనికొచ్చే వారి కోసం వెదుకుతున్న సమయంలో ఆ దేవి దృష్టి ఈ మంథర పైనే పడింది. పని జరగడానికి పనిముట్టు లభించింది. వెంటనే సరస్వతి పంథర మస్తిష్కాన్ని ఆవేశించింది. క్షణకాలంలో మంథర బుద్ధిని వక్రంగా మార్చివేసింది.
నగరమంతటా ఈ రోజు దీపావళి ఎందుకు జరుపుతున్నారు? ఎంతో కోలాహలంగా, హడావిడిగా ఉన్నాయి పరిసరాలు! కారణం ఏమిటి?” అని అడిగింది మంధర.
“పిచ్చిదానా! నీవు రాణివాసంలో పని చేస్తావు. మహారాణి కైకేయికి అరణపు దాసివి. నీకు ఈ విషయమే తెలియదా? రేపు రామచంద్రునికి యువరాజు పదవి ఇస్తున్నారు. ఆయనను రాజ్యాభిషిక్తుని చేస్తారు” అన్నారు ప్రజలు
మంథర ః అబద్ధం! అసంభవం! రాణివాసంలో అసలీ విషయమే ఎవరూ మాట్లాడుకోవటం లేదు. ఇది నిజమే అయితే నాకు ఈ విషయం గురించి తెలియకుండా వుండే ప్రసక్లే లేదు. జనం నవ్వారు.
“నీవెలా గూని దానివో నీ బుద్ధి కూడా గూనిదే! గూనిదాని చెవులు కూడా గూనిగానే ఉన్నాయి కాబోలు! నీవు పూర్తిగా తెలివిలేని దానివి”అన్నారు పరిహాసంగా
మంథరకు విపరీతంగా కోపం వచ్చింది. అసలే ఆమె దుష్టస్వభావం కలది. దానికి తోడు దుకాణంలోని వారు, ఇతరులు వేళాకోళం చేసే సరికి మరింత కోపగించుకుంది. ఆమె బుద్ధి పూర్తిగా భ్రష్టుపట్టింది. అసలే కాకరకాయ దానికి వేపను రుద్దారు. సహజంగా కాకరకాయ చేదుగా ఉంటుంది. వేపను దానికి జతచేస్తే దాని చేదు గుణం నూరు రెటు పెరిగిపోతుంది. అలాగే జరిగింది మంథర విషయంలోనూ!
బజారు నుండి వెనక్కు మళ్ళింది. మనసులోనే ఆలోచించుకుంటూ నడుస్తోంది. విధాత ప్రతికూలుడై ఉన్నాడు. రాజమహలులో దాసీగా ఉంటున్నా నామాటకు విలువ, నాకు గౌరవాదరాలు ఏమీ లేవే! దుకాణాల్లోని చిన్న చిన్న షావుకారు సైతం నన్ను అపహాస్యం చేయడానికి సాహసిస్తున్నారు. గూనిదాన్పైతే గూనిదాన్నే! అయితే ఏమిటట? ఈ యువరాజు పట్టాభిషేక మహోత్సవాన్ని భంగం చేయకుంటే నేను మంథరనే కాను. అంతఃపురంలోని రాణులు సైతం నా వద్ద రహస్యాలు దాస్తున్నారు.
అలా ఆలోచిస్తూ మంథర రాణివాసానికి చేరుకుంది. పెదవులు అదరుతున్నాయి. మనిషి వణికిపోతూ ఉంది. కళ్ళు ఎర్రగా నిప్పలు కురుస్తున్నటుగా ఉన్నాయి.
కైకేయి. మంథరను పరిశీలనగా చూసింది. “మంథరా! ఏమైంది? నెత్తిమీద భూతం సవారీ చేస్తున్నదా ఏమిటి? అలా వణికిపోతున్నావు” అంది.
మంథర :- గూని దాన్ని వదిలి భూతప్రేతాలు ఇతరుల నెత్తిపైకి ఆడడానికి వెళ్తాయా? వికలాంగులైన ప్రాణుల బలిదానం దేవతలకు, దేవుళ్ళకు పనికిరాదు.
మరీ ఆ గూనిది దేవతలకు పనికిరాకపోతే భూతప్రేతపిశాచాలకైనా పనికొస్తుంది. అవైనా నన్ను స్వీకరిస్తాయి. అంతేచాలు!
కైకేయి (నవ్వింది): నీకు ఏమైందే! ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు?
మంథర : నవ్వు! నవ్వు! ఇంకా ఎంతసేపు నవ్వగలవులే! ఇప్పడు నవ్వుతున్నావు! కాస్సేపయ్యాక ఏడుస్తూ తిరుగుదువుగానీ…
కైకేయి : నోర్ముయ్యవే! జాగ్రత్తగా సంభాళించుకొని మాట్లాడు. లేకుంటే నీ నాలుకను కోయించేస్తాను. ఏడవనీ నా శత్రువులు! నాకేం ఖర్మపట్టింది! నేనెందుకు ఏడుస్తాను?
మంథర : ముందు నా నాలుకను కోయించు. తరువాత చూద్దాం. నేనిందుకోసమే తగినదాన్ని
కైకేయి : అరే! అసలు విషయమేమిటో ఏమైనా చెబుతావా? లేక ఇలాగే .వాగతూ ఉంటావా?
మంధర : నా తలమీద భూతం నర్తిస్తోంది. రాత్రింబగళ్ళు నీకు సేవలు చేస్తూన్నాను దానికి ప్రతిఫలంగా నా నాలుక ఖండించబడబోతున్నది. ఓ విధాతా! నీ లీల విచిత్రమైనది! బహు గొప్పది!!
మందర : సరే! అభయమిస్తున్నాను. నీ నాలుక ఖండించబడదు. చాలా! చెప్పు! !చెప్పరాదుటే! మంథరా ”
మంథర : ఏం చెప్పమంటావు! కౌసల్య నీపై తన ప్రతీకారం తీర్చుకుంది. సంవత్సరాల తరబడిగా ఆమె ఈ పని కోసం కాచుక్కూర్చుంది. వేచి చూసి న సమయం ఇప్పడొచ్చింది. అవకాశం అంది వచ్చింది. ఆమె ఆశయం నెరవేరింది.
ఎవరో గానీ నిజమే చెప్పారు సుమా!
” రూప్ జిస్కా హై బురా, ఉస్కా హువా నామ్ బురా!
చూన్ కీ సౌత్ బురీ, సారేు కా సబ్ కామ్ బురా ! “
కౌసల్య పేరు వినగానే కైకేయికి అరికాళ్ళలో మంటలు పుట్టాయి. పాదాల అడుగుబాగంలో అంటిన మట్టి జారిపోయింది.
కైకేయి ఏం జరిగింది
మంథర : ఏం జరిగింది! జరగవలసిందే జరిగింది. ఇంకా ఏం జరగాలి? రేపు రామునికి పట్టాభిషేకం జరగనుంది. కౌసల మందిరంలో అభినందనలు వేడుకలు మార్మోగుతున్నాయి.
కైకయి ఇదెంతో ఆనందించవలసిన విషయం. అన్నదమ్ములందర్లోనూ రాముడు పెద్దవాడు. బుద్ధిమంతుడు. అతని పట్టాభిషేకం జరగవలసిందే! ఇవాళ కాకుంటే మహారాజుగారి అనంతరమైనా ఈ కోసల దేశానికి రాముడే రాజవుతాడు! రావే మంథరా! నీ నోటిని తీపి చేస్తాను. ముత్యాలతో నింపుతాను. నీవు శుభ సమాచారం వినిపించావు.
మంథరా : వహ్వా! భళా! నీ అమాయకత్వానికి జోహారు! ఇంతకు ముందే నా నాలుకను కోయించేస్తానన్నావు! ఇప్పడేమో ముత్యాలతో నింపుతానంటున్నావు! నా అదృష్టంలో ముత్యాలెక్కడున్నాయి తల్లీ? నాలుక తెగగానే రక్తం పొంగి నా నోరంతా రక్తంతో నిండిపోవటం ఖాయం. ఆపదలను ఎదుర్కొంటూ ఇక్కడెందుకు? నేనిక ఇప్పటి నుంచే నా మూటా ముల్లె సరుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాను.
మంథర మాటలు కైకేయిని ఆలోచింపచేశాయి. మనసులో మరేదో సంగతి దాచుకొని మంథర ఇలా వక్రంగా మాట్లాడుతోందని ఆమెకు అర్థమైంది.
కైకేయి : మంథరా! చెప్పదలచినదేదో స్పష్టంగా చెప్ప.
మంథర : నీవు అమాయకురాలవు! నిష్కపటివి. అయినా మహారాజు నిన్నెంతో ప్రేమిస్తాడని నీకు ఓ రకమైన గర్వం ఉంది. ఔనా! అదంతా అబద్ధం అని రుజువైంది. ఆయన కౌసల్య చేతిలో కీలుబొమ్మ ఆమె నేర్పిన పాఠాలనే ఇక్కడికి వచ్చి నీ ముందు వల్లించి నటిస్తాడు. మృదువైన సంభాషణలతో నీ ముఖస్తుతి చేస్తాడు. ఆయన మైనం ముద్ద. కౌసల్య ఎటు, ఎలా కావాలనుకుంటే అలా ఆయన్ని మలచుకుంటుంది. పెళ్ళికాగానే భరతుణ్ణి తాత గారింటికి కాశ్మీరుకు పంపించేశారు! ఇది గమనించావా? రాముని రాజ్యాభిషేకవార్త నీ చెవికి సోకకుండా జాగ్రత్తపడ్డారు. భరతుడు రామునికి అవరోధం అని ఆమెకు భయం. ఇంతవరకు నీకు ఎవరూ ఈ వార్తె అందించలేదు చూశావా?”
కైకేయి : ఇదంతా నీ మిథ్యాకల్పన! ఊహ! ఏం ఫరవాలేదులే!








Hits Today : 806
Total Hits : 1720222